వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించాలి
ప్రశాంతి నిలయం: వినియోగదారులు హక్కులు, చట్టాలపై పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాలని పౌర సరఫరాల శాఖ, తూనికలు కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు పురస్కారాలతను అందజేసి, అభినందించారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించిన స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులకు సర్టిఫికెట్‌లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, డీఈఓ క్రిష్టప్ప, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
బాలల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
జిల్లాలో బాలల సంరక్షణ గృహాల్లో ఆశ్రయం పొందుతున్న పిల్లల భద్రత, సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారునలు జేసీ ఆదేశించారు. జూవైనల్ జస్టిస్ యాక్ట్–2015 మేరకు రిజిస్ట్రేషన్ పొందిన బాలల వసతి గృహాల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన తనిఖీ బృందం సమావేశం మంగళవారం కలెక్టరేట్‌లో జరిగింది. జిల్లాలోని తొమ్మిది బాలల వసతి గృహాల్లో పిల్లల ప్రస్తుత పరిస్థితులపై బృందం సభ్యులతో జేసీ సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ మేడా రామలక్మి, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ నాగమల్లేశ్వరి, మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ గీతాబాయి, జిల్లా బాలల సంక్షేమ అధికారి మహేష్, జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యుడు శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ మునిచంద్రిక, తదితరలు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్


