జగనోత్సాహం
సాక్షి, పుట్టపర్తి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అనాథ ఆశ్రమాల్లో దుస్తుల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ప్రతి గ్రామంలో కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సీనియర్ నేత దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ జన్మదిన వేడుకలు జరిగాయి.
కదిరి పట్టణంలోని గురుకులం అనాథ పిల్లల ఆశ్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం సర్కిల్‌లో కేక్ కట్ చేశారు. పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్, సీనియర్ నేతలు ఇస్మాయిల్, పూల శ్రీనివాసరెడ్డి, వజ్ర భాస్కర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హిందూపురం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుమతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నివాసంలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే స్థానిక వైఎస్సార్ సర్కిల్‌లో మహానేత వైఎస్సార్ విగ్రహం వద్ద జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ భర్త చరణ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ చిత్రపటం ముందు కేక్ కట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే కేక్‌కట్ చేసి మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
ఘనంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఊరూరా పండుగ వాతావరణం
కేక్‌కట్ చేసి పంచిపెట్టిన అభిమానులు
పలుచోట్ల వైద్య, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు
పుట్టపర్తిలో రక్తదాన శిబిరం
పెనుకొండలో ఘనంగా..
హిందూపురంలో కేక్ కటింగ్
మడకశిరలో ఉత్సాహంగా..
కదిరిలో అన్నదానం
ధర్మవరంలో సంబరాలు
అభిమానం ఉప్పొంగింది. జై జగన్ నినాదం మార్మోగింది. ఊరూ వాడా తేడా లేకుండా మాజీ ముఖ్యమంత్రి , వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ జన్మదినాన్ని ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అన్నిచోట్లా కేక్‌లు కట్ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలను జోరుగా నిర్వహించారు. వందేళ్లు వర్థిల్లు జననేతా అంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు.
జగనోత్సాహం


