ఆకట్టుకున్న ‘త్వమేవహం’
ప్రశాంతి నిలయం: నవ విధ భక్తి భావనతో భక్తుడు దేవునిలో లీనమైపోవడమే నిజమైన దైవత్వం అన్న సత్యసాయి సందేశాన్ని వినిపిస్తూ సాగిన ‘త్వమేవహం’ నాటిక భక్తుల మదిని మైమరపింపజేసింది. ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం న్యూజిలాండ్ దేశానికి చెందిన సత్యసాయి భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలు, నృత్య ప్రదర్శనతో వారు నిర్వహించిన ‘త్వమేవహం’ నాటిక భక్తులను ఆకట్టుకుంది. అనంతరం భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.
ఆకట్టుకున్న ‘త్వమేవహం’
ఆకట్టుకున్న ‘త్వమేవహం’


