జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
పరిగి: మండలంలోని ధనాపురం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని ఎన్.అవంతి... జాతీయ స్థాయి అండర్–14 వాలీబాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థిని శుక్రవారం హెచ్‌ఎంతో పాటు పీడీ నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.
ధర్మవరం పోలీసులకు
ఏబిసీడీ అవార్డు
ధర్మవరం రూరల్: ధర్మవరం పోలీసులకు రాష్ట్రస్థాయి ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డు దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచే కేసుల వివరాల ఆధారంగా ప్రతి మూడు నెలలకోసారి ఏబీసీడీ అవార్డును ప్రకటిస్తారు. ఈ క్రమంలో 2024లో నాగలూరు వంక వద్ద గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం కావడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం అది హత్యగా నిర్ధారణ కావడంతో పక్కా ఆధారాలతో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన అప్పటి ఎస్పీ రత్న, ధర్మవరం రూరల్ సీఐ ఎన్. ప్రభాకర్, ఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు చత్రూనాయక్, బాలకృష్ణ, అనిల్‌కుమార్‌ను అభినందిస్తూ శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏబీసీడీ అవార్డును డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా అందజేశారు.
సబ్సిడీ విత్తన
వేరుశనగలో రాళ్లు
బ్రహ్మసముద్రం: రబీ సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన విత్తన వేరుశనగలో నాణ్యత కొరవడింది. శుక్రవారం మండల కేంద్రం బ్రహ్మసముద్రంలోని రైతు సేవ కేంద్రం (ఆర్‌ఎస్‌కే) నుంచి ఓ రైతు సబ్సిడీ విత్తన వేరుశనగ తీసుకున్నాడు. 30 కిలోల బస్తా రూ.1,650 చొప్పున వసూలు చేశారు. అయితే ఈ బస్తాలో కిలో వరకు రాళ్లు ఉండటంతో రైతు కంగుతిన్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇలా పంపిణీ చేస్తే ఎలా అంటూ వాపోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంగన్‌వాడీ పోస్టుల
భర్తీకి చర్యలు
● 22 నుంచి 30వ తేదీ లోపు
దరఖాస్తుల స్వీకరణ
● ఐసీడీఎస్ పీడీ ప్రమీల
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు ఐసీడీఎస్ పీడీ ప్రమీల తెలిపారు. జిల్లాలోని 12 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 11 అంగన్‌వాడీ కార్యకర్తలు, 58 ఆయా పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 22 నుంచి 30వ తేదీలో ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల్లో దరఖాస్తులు పొంది, 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమర్పించాలన్నారు. గడువు దాటిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు.
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక


