బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వం పట్టు రైతులకు బకాయిగా ఉన్న మొత్తాన్ని విడుదల చేయాలి. సబ్సిడీ బకాయిలను మాత్రమే విడుదల చేసి చేతులు దులుపు కోవడం సరైన చర్య కాదు. బైవోల్టిన్ పట్టు రైతుల ప్రోత్సాహక బకాయిలను విడతల వారీగానైనా మంజూరు చేసి ఆదుకోవాలి. – వెంకట్రామిరెడ్డి,
రాష్ట్ర అధ్యక్షుడు, పట్టు రైతుల సంఘం
కరుణ చూపాలి
కేంద్ర ప్రభుత్వం పట్టు రైతులకు సబ్సిడీని సకాలంలో చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు రైతులపై కరుణ చూపి తన వాటా మొత్తం చెల్లించాలి. బైవోల్టిన్ రైతులకు ఇప్పటి వరకూ రూ. రూ.76 కోట్ల మేర ప్రోత్సాహకం ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేస్తే చాలా మేలు జరుగుతుంది. – దశనాథరెడ్డి, పాపసానిపల్లి,
మడకశిర మండలం
బకాయిలు వెంటనే చెల్లించాలి


