వణుకుతున్న అనంత
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి ‘అనంత’ చలికి గజ గజ వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పతనమవుతుండటంతో చలి తీవ్రత బాగా పెరిగింది. వేకువజామున పొగమంచుతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గురువారం మడకశిర మండలంలో 9.4 డిగ్రీలు, శెట్టూరు మండలంలో 10.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో కూడా 11 డిగ్రీల నుంచి 16 డిగ్రీల మధ్య రికార్డు అయ్యాయి. పగలు కూడా ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య నమోదవుతుండటంతో చలి ప్రభావం కనిపిస్తోంది. సాయంత్రం 5 గంటలకే పొగమంచు మొదలై మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ కొనసాగుతోంది. దీంతో పగలు రాత్రి లేకుండా చలిగాలులతో జనం వణుకుతున్నారు.
మడకశిరలో 9.4 డిగ్రీలు,
శెట్టూరులో 10.5 డిగ్రీలు


