ఉచిత బస్సు.. ఆపితే ఒట్టు
చెన్నేకొత్తపల్లిలో బస్సు కోసం పరుగులు తీస్తున్న మహిళలు
ఉచిత బస్సు ప్రయాణం మహిళలను కష్టాలకు గురి చేస్తోంది. గురువారం వివిధ పనుల నిమిత్తం వచ్చిన మహిళలు.. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్‌లో బస్సుల కోసం చాలా సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కొన్ని బస్సులు మహిళలను చూసి ఆపకుండా వెళ్లిపోయాయి. ఓ బస్సు బస్టాండ్‌లో ఆగకుండా న్యామద్దల సర్కిల్‌కు సమీపంలో ఆగింది. బస్సు కోసం చిన్నారులను ఎత్తుకుని మహిళలు, వృద్ధులు పరుగులు తీశారు. తీరా సర్కిల్ వద్దకు చేరుకునే లోపు బస్సు అక్కడి నుంచి వెళ్లింది. బస్టాండ్ల వద్ద బస్సులు ఆపనప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని (సీ్త్ర శక్తి) ఎందుకు అమలు చేసిందని మహిళలు మండిపడ్డారు. – చెన్నేకొత్తపల్లి:


