రాత్రింబవళ్లూ తవ్వుతున్నారు
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పెన్నానదిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. పగలు, రాత్రి ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్‌కు వినతులు అందించాం. అయినా ఇసుక దందా ఆగడం లేదు. పెన్నానదిని నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న రైతుల కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి.
– రామచంద్రారెడ్డి, చిన్నమంతూరు


