బతిమాలుతున్నా వినడం లేదు
పెన్నానదిలో ఫిల్టర్ బోరు వేసుకుని మా పొలంలో పంటలు సాగుచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అయితే బోరు వద్ద ఇసుకను అక్రమంగా పెద్ద ఎత్తున తవ్వుతుండటంతో బోరు బయటపడి ధ్వంసమైంది. బోరు వద్ద ఇసుక తవ్వకాలు చేయొద్దని చెప్పినా మా మాటలు పట్టించుకోవడం లేదు. బోరు తేలిపోతే నీరు రాక సాగు చేసిన పంట ఎండిపోతాయని రైతులందరూ బతిమాలుతున్నా వారికి పట్టడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలి.
– రవి, రైతు, పి.కొత్తపల్లి


