మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి
మడకశిర: మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టి, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను కార్పొరేట్, ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, రూ.6,400 కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బద్రీనాథ్, గిరీష్, రాహుల్, యశ్వంత్, చిత్రలింగ, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐఎస్‌ఎఫ్ ధర్నా


