బైక్ ఢీకొని వైఎస్సార్‌సీపీ నేత మృతి
పుట్టపర్తి టౌన్: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో వైఎస్సార్‌సీపీ నేత మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కపట్నం మండలం సిద్ధరాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత నేలకోటప్ప(69), సిద్ధరాపురం సర్పంచ్ రమణయ్య సోమవారం ఉదయం పుట్టపర్తిలో జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో పాల్గొనేందుకు స్కూటీపై బయలుదేరారు. మార్గమధ్యంలో బుక్కపట్నం చేరుకోగానే రోడ్డు పక్కన వాహనాన్ని ఆపారు. అదే సమయంలో తలుపుల మండలం అపిలేపల్లి గ్రామానికి చెందిని మల్లికార్జున కొత్తచెరువు వైపు నుంచి ముదిగుబ్బకు పల్సర్ బైకుపై వెళుతూ స్యూటీని ఢీకొనడంతో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన రమణయ్య, నేలకోటప్పను స్థానికులు వెంటనే సత్యసాయి సూపర్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో నేలకోటప్ప మృతి చెందాడు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న పుట్టపర్తి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రుడు రమణయ్యను పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలో మార్చురీకి చేర్చిన నేలకోటప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.
బైక్ ఢీకొని వైఎస్సార్‌సీపీ నేత మృతి


