ఘనంగా కేంద్రీయ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం
గోరంట్ల: మండలంలోని పాలసముద్రం వద్ద ఉన్న కేంద్రీయ విద్యాలయలో ఆ విద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాసిన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయ తమ క్యాంపస్‌లో ఏర్పాటు కావడం మంచి పరిణామమన్నారు. ప్రిన్సిపాల్ బట్నా కృష్ణారావు మాట్లాడుతూ.. 1963లో ఏర్పాటైన కేంద్రీయ విద్యాలయ ప్రస్థానాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు. ఐదో తరగతి విద్యార్థినులు శ్రీకాంత్‌రెడ్డి రక్తాన్ని సేకరించి పరీక్షలు నిర్వహించి ‘0’ పాజిటివ్‌గా నిర్ధారించడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు, పాత్రికేయులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శివాంగి, అనామికా, షీమా, నసీమా, బల్కిస్, భాగ్యలక్ష్మి, లక్ష్మీదేవి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


