జీఎంసీల్లో ఫిజియోథెరపీ కోర్సు
● ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్
అనంతపురం మెడికల్: రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)ల్లో ఫిజియోథెరపీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనంతపురంలోని కస్తూరి ఫిజియోథెరపీ కళాశాలలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను అందజేసి, మాట్లాడారు. కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బెన్‌డెక్ట్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.


