జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి

Nov 23 2025 6:19 AM | Updated on Nov 23 2025 6:19 AM

జాతీయ

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి

విద్యార్థిని అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌, తదితరులు

పెనుకొండ: పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి లిఖిత్‌కుమార్‌ జాతీయ సాహస శిబిరానికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ జయప్ప శనివారం తెలిపారు. ఈనెల 27 నుంచి డిసెంబర్‌ 6 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగే శిబిరంలో లిఖిత్‌కుమార్‌ పాల్గొంటారన్నారు. ఈసందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌తోపాటు అధ్యాపకులు ప్రతాప్‌, యశోధారాణి, రామాంజినేయులు అభినందించారు.

రైలు కింద పడి వృద్ధుడి మృతి

చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రానికి సమీపంలో శనివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు రైలు కిందపడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. చెన్నేకొత్తపల్లి నుంచి పెనుకొండ వైపునకు వెళ్లే రైల్వే ట్రాక్‌పై దాదాపు 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధుడి మృతదేహం పడి ఉంది. మృతుడు ఆకుపచ్చ బనియన్‌తో పాటు తెల్లని షర్టు, నీలం రంగు నిక్కరు ధరించి ఉన్నాడు. టర్కీ టవాల్‌ కూడా ఉంది. మృతుడు ఈ ప్రాంతానికి చెందిన వాడు కాదని గ్రామస్తులు తెలిపారు.

రసవత్తరంగా బాస్కెట్‌బాల్‌ పోటీలు

నూజివీడు: నూజివీడులో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్‌ బాలుర, బాలికల అండర్‌–17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలికల విభాగంలో వైజాగ్‌ జట్టు అనంతపురంపై గెలుపొందింది. బాలుర విభాగంలో అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై 32–8తో విజయం సాధించింది. అలాగే మరోమ్యాచ్‌లో అనంతపురం జట్టు విజయనగరంపై 29–0 గెలుపొందింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో గుంటూరు జట్టు అనంతపురంపై 35–17 తేడాతో విజయం సాధించింది. కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, వైజాగ్‌ జట్లు సెమీస్‌కు చేరాయి.

అధికారుల తప్పు.. విద్యార్థులకు శిక్ష

పుట్లూరు: ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం సమయానికి బస్సును నడపకపోవడంతో శనివారం కోమటికుంట్ల, గరుగుచింతపల్లి, గోపురాజుపల్లి గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అయితే శనివారం మండలంలోని అన్ని పాఠశాలలకు కాంప్లెక్స్‌ సమావేశాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో సాయంత్రం పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులను మధ్యాహ్నమే ఇళ్లకు పంపించారు. గ్రామాలకు వెళ్లడానికి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ గరుగుచింతలపల్లి బస్సు రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చామనిచెప్పి చేతులు దులుపుకుంటున్నారు.

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి 1
1/3

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి 2
2/3

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి 3
3/3

జాతీయ సాహస శిబిరానికి పెనుకొండ విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement