‘పట్టు’ ప్రోత్సాహకాలు విడుదల చేయాలి
హిందూపురం టౌన్: పట్టు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులను వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్నా ప్రోత్సాహాకాలను విడుదల చేయాలని కోరుతూ పట్టు రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం పట్టు పరిశ్రమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ముందు అందోళన చేపట్టారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ శ్రీనివాసులు, పట్టు రైతు సంఘం జిల్లా అధ్యక్షక్ష , కార్యదర్శులు సోమకుమార్, సిద్ధారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పట్టు రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టు రైతులను ఆదుకుంటుందని రైతులు ఆశించారని, అయితే చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. వెంటనే బకాయి ఉన్నా ప్రోత్సాహకాలు విడుదల చేసి పట్టు రైతులను హాదుకోవాలన్నారు. షెడ్ల నిర్మాణానికి రూ.4 లక్షలు ప్రభుత్వం ఇస్తోందని, షెడ్డు నిర్మాణానికి రూ.16 లక్షల వరకూ ఖర్చు అవుతోందని 90 శాతం సబ్సిడీతో షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయుత నివ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏడీకి అందించారు. కార్యక్రమంలో నాయకులు నవీన్, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.


