కొత్తగ్యాదికుంటలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇంటి పునాదులను తొలగించిన దృశ్యం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మౌనికకు ఇచ్చిన ఇంటి పట్టా
రామగిరి: మండలంలోని కొత్తగ్యాదికుంటలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి పట్టాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టగా శనివారం వాటిని జేసీబీలతో తొలగించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత గ్రామమైన నసనకోట పంచాయతీ వెంకటాపురం గ్రామానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న కొత్తగ్యాదికకుంట జగనన్న కాలనీలో స్థానిక టీడీపీ నేతలు ఉద్దేశ పూర్వకంగా గతంలో ఇచ్చిన లబ్ధిదారుల ఇళ్లను జేసీబీ వాహనాలతో తొలగింపజేశారు. గ్రామంలో మూడు చోట్ల జగనన్న కాలనీలు ఏర్పాటు చేయగా , ఆ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు అయిన మౌనిక, బొగ్గు ఈశ్వరమ్మ, చాకలి స్వాతి, ముత్యాలమ్మ, లక్ష్మన్నలకు చెందిన ఇంటి పునాదులను టీడీపీ నేతలు జేసీబీల ద్వారా తొలగించారు. ఈ విషయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే లబ్ధిదారులు ఇంటి పునాదులను తొలగించారని వాపోతున్నారు.
కొత్తగ్యాదికుంటలో ఇంటి పునాదులు తొలగించిన టీడీపీ నేతలు
వైఎస్సార్‌సీపీ వర్గీయులే లక్ష్యం


