విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో యువకుడి మృతి
పరిగి: మండలలలోని పెద్దిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఏవీ వైన్ షాపులో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నితిన్ (39) చనిపోయాడు. పోలీసుల వివరాలమేరకు.. పావగడ తాలూకా పలవళ్లికి చెందిన నితిన్ కొంతకాలంగా పరిగి మండలంలోని పెద్దిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఏవీ వైన్ షాపులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. వీలు కలిగినప్పుడు తన స్వంత గ్రామానికి వెళ్లే ఆయన నిత్యం రాత్రి వేళల్లో వైన్ షాపులోనే నిద్రించేవాడు. యథావిధిగా గత శుక్రవారం షాపు మూసి, లోపల పడుకున్నాడు. ఈక్రమంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో వైన్ షాపు తెరవడానికి మిగిలిని సిబ్బంది వెళ్లారు. కిటికిలో చూసిన సిబ్బందికి విగతజీవిగా పడి ఉన్న నితిన్‌ను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ వెంకటేశులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మంటలకు కాలిపోయిన నితిన్ మృతదేహాన్ని గుర్తించారు. అలాగే 15 మద్యం (180 ఎంఎల్ ఉన్న) బాక్సుల వరకూ మంటల్లో కాలిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు.
మళ్లీ ఆస్పత్రి పాలైన
కల్తీకల్లు బాధితుడు
హిందూపురం టౌన్: మండల పరిధిలోని చౌళూరులో కల్తీ కల్లు సేవించి గతంలో ఆస్పత్రి పాలైన సిద్ధలింగప్ప మరోసారి ఆస్పత్రిపాలయ్యాడు. దాదాపు 20 మందికి పైగా కల్తీ కల్లును సేవించి ఆరోగ్యాలు దెబ్బతిని ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. వారికి కల్లు నిర్వాహకులు కర్ణాటకలోని ఆస్పత్రిలో వైద్యమందించి డిశ్చార్జ్ చేయించారు. అయితే కల్తీ కల్లు బాధితుడు సిద్ధలింగప్పను ఐసీయూలో ఉంచి చికిత్సను అందించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం బాగుపడకపోవడంతో అతడిని తిరిగి శనివారం హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న కల్లు నిర్వాహకులు సిద్ధలింగప్పకు వైద్యం చేయిస్తామని మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెనుకొండ: పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటాపురం తండా సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేపాల్‌కు చెందిన గోబీలాల్ బెహరా (57) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బస్సులో బెంగళూరు వైపు బయలుదేరారు. అయితే రబ్బరు ఫ్యాక్టరీ సమీపంలో బస్సు రిపేరీ కావడంతో రోడ్డు పక్కన నిలిపి మరమ్మతు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఆగివున్న బెహరాను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ప్రాణాలు
కాపాడిన పోలీసులు
గుమ్మఘట్ట: ఓ మహిళ ప్రాణాలను పోలీసులు కాపాడిన ఘటన మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు .. రాయదుర్గం పట్టణానికి చెందిన లక్ష్మీకి ప్రభుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. అయితే తాగుడుకు బానిసైన భర్త రోజూ భార్యతో గొడవ పడుతుండటంతో పోరు పడలేక అక్కడ నుంచి రాయదుర్గం పట్టణంలోని తల్లి అజ్జమ్మ వద్దకు చేరుకుని తన బాధ చెప్పుకుంది. భర్త దగ్గరే ఉండాలని తల్లి నచ్చచెప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విరక్తి చెందిన లక్ష్మీ బీటీప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బీటీపీకి చేరుకున్న ఆత్మహత్యకు యత్నిస్తుండగా గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న ఎస్‌ఐ ఈశ్వరయ్య ఆమెను రక్షించి తల్లి అజ్జమ్మకు అప్పగించారు. మహిళ ప్రాణం కాపాడడంతో ఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బందిని రూరల్ సీఐ వెంకటరమణ అభినందించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో యువకుడి మృతి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో యువకుడి మృతి
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో యువకుడి మృతి


