
యాడికి: తాను ప్రేమించిన యువతికి మరో యువకుడితో పైళ్లెనట్లు తెలుసుకుని క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన బాలగంగన్న, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్న కుమారుడు జయకృష్ణ (22) ఓ యువతిని ప్రేమిస్తున్నానని.. ఆమెతో తనకు పెళ్లి చేయాలని 3 నెలల క్రితం తల్లిదండ్రులను కోరాడు. అయితే నెల రోజుల క్రితం ఆ యువతికి మరో యువకుడితో ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసినట్లుగా తెలిసింది.
దీంతో మనోవేదనకు లోనైన జయకృష్ణ శనివారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున పిలిచినా స్పందన లేకపోవడంతో మిద్దైపెకి ఎక్కి గవాక్షం నుంచి కుటుంబసభ్యులు చూశారు. అప్పటికే ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న జయకృష్ణను గమనించి బలవంతంగా తలుపులు తీసి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.