
నాలుగు పోస్టులకు అర్హత
పరిగి: మెగా డీఎస్సీలో పరిగి మండలంలోని కొడిగెనహళ్లి వాసి కేవీ వేదవ్యాస ఏకంగా నాలుగు పోస్టులకు అర్హత సాధించారు. పరిగి మండలంలోని కొడిగెనహళ్లిలో నివాసముంటున్న వాసుదేవరావు, శారద దంపతుల కుమారుడు వేదవ్యాస్ (25) డీఎస్సీలో ఏకంగా నాలుగు పోస్టులకు అర్హత సాధించారు. వేదవ్యాస కర్ణాటకలోని మైసూరులో బీఎస్సీ బీఎడ్‌లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును పూర్తి చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేసిన అనంతరం 2024లో ఉత్తీర్ణులయ్యారు. అదే ఏడాది నిర్వహించిన టెట్ ఎక్జామ్‌లో 118 మార్కులను సాధించాడు. తాజాగా నిర్వహించిన డీఎస్సీ 2025 పరీక్షలో జోన్–4లో పీజీటీ ఫిజికల్ సైన్సస్ విభాగంలో 69.5 మార్కులతో మొదటి ర్యాంకును సాధించారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌లో 83.23 ర్యాంకుతో జిల్లా స్థాయి మూడో ర్యాంకు, మోడల్ రెసిడెన్సియల్ స్కూల్‌కు టీజీటీ ఫిజికల్ సైన్స్ జోనల్ 4లో 78.73 మార్కులతో రెండో ర్యాంకు, మోడల్ రెసిడెన్సియల్ స్కూల్స్ విత్ బయాలజీ అండ్ ఫిజిక్స్ విభాగంలో 74.75 ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచాడు. తాను సివిల్స్ లక్ష్యంగా చదువుతున్నట్లు వేదవ్యాస పేర్కొన్నారు. కాగా వేదవ్యాస తండ్రి వాసుదేవరావు మండలంలోని ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు.