
శనీశ్వరా.. పాహిమాం
పావగడ: స్థానిక స్వర్ణ శనీశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని చివరి శ్రావణ బహుళ అమావాస్య శనివారం శని వారోత్సవ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలో నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు. తమను వెంటాడుతున్న శని దోషాలను నివారించి కష్టాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. దీక్షా మంటపంలో తల నీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. నవ గ్రహ పూజలకు భక్తులు పోటెత్తారు. పలువురు ఆర్య వైశ్య వ్యాపారులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు లాయర్ వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి సుబ్బనరసింహ తదితరులు భక్తులకు సేవలందించారు.

శనీశ్వరా.. పాహిమాం

శనీశ్వరా.. పాహిమాం