
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్య్ర వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ భక్తిని చాటాయి. పోలీసుల జాగిలాలు చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి. వేడుకల్లో భాగంగా జీవనజ్యోతి (ధర్మవరం) పాఠశాల విద్యార్థులు దేశభక్తిని చాటే విధంగా ‘వందేమాతరం‘ పాటకు చేసిన నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది, కేజీబీవీ(జగరాజుపల్లి) విద్యార్థులు ‘గలగల పారే గోదావరి’, గిరిజన సంక్షేమ పాఠశాల (కదిరి) విద్యార్థుల పూరియా ఘడేతీ, గిరిజన సంక్షేమ పాఠశాల ( గోరంట్ల) విద్యార్థుల ‘మారోవేశ్ పురో దేవ్’ నృత్యరూపకాలు అలరించాయి. డైట్ కాలేజ్ (బుక్కపట్నం ) విద్యార్థులు ‘నింగి వంగి నేల పొంగి’ దేశ భక్తి గేయ ప్రదర్శన ఆకట్టుకుంది. పరేడ్ మైదానం చుట్టూ కట్టిన మూడురంగుల బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు