
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు
● ఒక్కరోజే 746.4 మి.మీ వర్షపాతం నమోదు
పుట్టపర్తి అర్బన్: వారం రోజులుగా మోస్తరు వర్షాలతో పలకరించిన వరుణుడు శుక్రవారం రాత్రి నుంచి విరుచుకుపడ్డాడు. శనివారం ఉదయం వరకూ జిల్లా అంతటినీ విడతల వారీగా తడిపేశాడు. దీంతో జిల్లా పరిధిలో ఒక్కరోజే 746.4 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా అమరాపురం మండలంలో 68.8 మి.మీ, తాడిమర్రి మండలంలో 59.4 మి.మీ, కొత్తచెరువు 56 మి.మీ మేర వర్షం కురిసిందన్నారు. అలాగే ధర్మవరం మండలంలో 52.6 మి.మీ, హిందూపురం 47.8, కనగానపల్లి 47.6, రొద్దం 46.2, చెన్నేకొత్తపల్లి 45.8, బత్తలపల్లి 43.4, పరిగి 35.6, ముదిగుబ్బ 22.6, గోరంట్ల 21.4, లేపాక్షి 20, అగళి 19.6, రొళ్ల 16.4, సోమందేపల్లి 16.2, కదిరి 15.0, గుడిబండ 14.2, తలుపుల 13.2, పుట్టపర్తి 12.8, బుక్కపట్నం 10.8, మడకశిర 10, అమడగూరు 8.4, ఎన్‌పీకుంట 8.2, చిలమత్తూరు 7.2, రామగిరి 6.8, నల్లమాడ 6.2, పెనుకొండ 5.6, గాండ్లపెంట 2.8, ఓడీచెరువు 2.2, తనకల్లు 2, నల్లచెరువు మండలంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో వంకలు పారుతున్నాయి. అక్కడక్కడా ఉద్యాన పంటలతో పాటు బంతి, చామంతి, ఉల్లి, మిరప పంటలకు కొంత మేర నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు