
పేదల రక్తాన్ని జలగల్లా తాగేస్తున్నారు
మైక్రో ఫైనాన్స్ కంపెనీలు రైతులను, అమాయకులను లక్ష్యంగా చేసుకొని వారికి రుణాలు ఇచ్చి రూ.20 వడ్డీతో వసూళ్లు చేస్తున్నారు. ధర్మవరం ఘటన కూడా ఒక ఉదాహరణ. ఏడాదిగా మైక్రోఫైనాన్స్ సంస్థలు రెచ్చిపోతున్నాయి. నిబంధనలేవీ పాటించకుండా రైతుల నెత్తిన అప్పుల కుప్ప పెడుతూ వేధిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం మైక్రో ఫైనాన్స్ సంస్థలపై దృష్టి సారించి వేధింపులకు గురిచేసే సంస్థలపై చర్యలు తీసుకోవాలి.
– ఫిరంగి ప్రవీణ్‌కుమార్, జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మికసంఘం