
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
గోరంట్ల: మండలంలోని గుమ్మయ్యగారిపల్లి సమీపంలో విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక ఉన్న పొలంలో చెట్టుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 45 ఏళ్లు ఉంటాయని అంచనా వేశారు. కుడిచేతిపై ‘అమ్మ’ అని పచ్చబొట్టు ఉంది. నీలం రంగు గీతల షర్ట్ ధరించాడు. టవాల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించి, కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు గోరంట్ల పోలీసులను సంప్రదించాలని సీఐ శేఖర్ కోరారు.
బొలికొండ రంగనాథుడి
కల్యాణోత్సవం నేడు
గుత్తి రూరల్: మండలంలోని జక్కలచెరువు గ్రామంలో వెలిసిన బొలికొండ రంగనాథస్వామి కల్యాణోత్సవం శనివారం నిర్వహించనున్నార. ఈ మేరకు ఆలయ ఈఓ ఽశోభ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఏటా కల్యాణోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ శనివారం ఉదయం 11 నుంచి 12.05 గంటల్లోపు వేడుక నిర్వహణకు అర్చకులు ముహూర్తం నిర్ణయించారు.