టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

Jun 3 2025 12:19 AM | Updated on Jun 3 2025 12:19 AM

టీబీ

టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

ప్రశాంతి నిలయం: క్షయ(టీబీ)ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ తరఫున సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్‌ విడుదల చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీబీ నిర్మూలనకు 100 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాఠశాలలు, పంచాయతీ రాజ్‌ సంస్థలు, స్వయం సహాయక బృందాలు, అంగన్‌ వాడీలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలన్నారు. టీబీపై అవగాహన పెంచి దాన్ని ఎదుర్కొనే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఫైరోజా బేగం, డీఎల్‌టీఓ డాక్టర్‌ తిప్పయ్య, డీసీహెచ్‌ఎస్‌ మధుసూదన్‌, మలేరియా అధికారి లక్ష్మానాయక్‌, మలేరియా సబ్‌యూనిట్‌ ఆఫీసర్‌ రమణ, గోపీనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసరాలు

సక్రమంగా అందించాలి

జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

నల్లమాడ: అవినీతి, అక్రమాలకు తావులేకుండా చౌకదుకాణాల ద్వారా నిత్యావసరాలు సక్రమంగా పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ డీలర్లను ఆదేశించారు. సోమవారం ఆయన నల్లమాడ –1 చౌక దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరుకుల పంపిణీని స్వయంగా పరిశీలించారు. ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్ణీత సమయాల్లో డీలర్లు అందుబాటులో ఉంటూ కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలన్నారు. 60ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దనే సరుకులు అందజేయాలని సూచించారు. అనంతరం క్యూ ఆర్‌ కోడ్‌ గురించి డీలర్లకు అవగాహన కల్పించారు. జేసీ వెంట తహసీల్దార్‌ రంగనాయకులు ఉన్నారు.

సరిహద్దులో గెలిచినా.. ఊళ్లో ఓడిపోతున్నా

కబ్జాకు గురైన తన భూమిని

పరిరక్షించాలి

వీడియో ద్వారా కోరిన

బీఎస్‌ఎఫ్‌ జవాన్‌

అమరాపురం: సరిహద్దులో ఉంటూ దేశ రక్షణలో విజయం సాధిస్తున్న తాను స్వగ్రామంలో ఆస్తులను కాపాడుకోలేక ఓడిపోతున్నానంటూ ఓ జవాన్‌ ఆవేదనతో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అమరాపురం మండల పరిధిలోని ఉదుగూరుకు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ నరసింహమూర్తి కె.శివరం గ్రామంలో వివాహం చేసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా మరో ప్రాంతంలో ఉన్న ఆయన ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. తనకు చెందిన 2.09 ఎకరాల భూమిని కె.శివరం గ్రామానికి చెందిన నాగరాజు కబ్జా చేశాడని ఆరోపించారు. తనకు హక్కుగా రావాల్సిన భూమిని సాగు చేయడానికి వెళితే నాగరాజు దాడులు చేస్తున్నాడని, రాళ్లు, కొడవలితో భయపెడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ఇచ్చినా రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. జవాన్‌ వీడియో వైరల్‌ కావడంతో తహసీల్దార్‌ లక్ష్మీనరసింహ సోమవారం మధ్యాహ్నం కె.శివరం గ్రామానికి వెళ్లి సంబంధిత భూమిని పరిశీలించారు. డాక్యుమెంట్లను తీసుకురావాలని జవాన్‌ మామకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. అలాగే వారికి రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

టీబీ నిర్మూలనకు  చర్యలు చేపట్టాలి 1
1/2

టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

టీబీ నిర్మూలనకు  చర్యలు చేపట్టాలి 2
2/2

టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement