
●తాగునీటి కోసం ఆందోళన
రొళ్ల మండలంలోని రత్నగిరి పంచాయతీ
ఉజ్జినీపురం గ్రామంలో మహిళలు నీటి కోసం ఆందోళనకు దిగారు. గ్రామంలో వాటర్ వర్క్స్ బోరుబావికి అమర్చిన విద్యుత్
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. వారం రోజులు గడుస్తున్నా ట్రాన్స్‌ఫార్మర్ బిగించి సమస్యను పరిష్కరించలేదు. దీంతో నీటి సరఫరా నిలిచిపోగా శుక్రవారం మహిళలు
పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రెండో రోజుల్లోగా నీటి సమస్య
పరిష్కరించకపోతే ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. – రొళ్ల: