
సిద్ధేశ్వరుడిని దర్శించుకున్న మంచు మనోజ్ దంపతులు
అమరాపురం/మడకశిర: మండలంలోని హేమావతిలో వెలసిన సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం సినీ హిరో మంచు మనోజ్ దంపతులు సందర్శించారు. వారికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం 5 గంటలకు మడకశిర మీదుగా బెంగళూరుకు వెళ్లారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడ ఉన్నారు.