
ఉచిత వైద్యాన్ని దూరం చేసే కుట్ర
నల్లమాడ: మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్‌పరం చేయడం ద్వారా పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి ధ్వజమెత్తారు. నల్లమాడ మండలం చారుపల్లిలో గురువారం ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యర్రవంకపల్లి, రెడ్డిపల్లి, వేళ్లమద్ది, కొండకింద తండా, పాతబత్తలపల్లి పంచాయతీలోని నల్లసింగయ్యగారిపల్లిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో శ్రీధరరెడ్డి మాట్లాడారు. పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే, ఆ పథకాన్ని మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. ఏడాదిన్నర పాలనలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ హయాంలో గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించామన్నారు. మళ్లీ ఆ సువర్ణ పాలనను తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని, కోటి సంతకాల కార్యక్రమం ద్వారా చంద్రబాబు వైఫల్యాలను నిలదీద్దామంటూ పిలుపునిచ్చారు. కాగా, శ్రీధరరెడ్డి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయా గ్రామాల్లో విశేష స్పందన లభించింది. నాయకులు, కార్యకర్తలే కాకుండా వృద్ధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో సంతకాలు చేయడానికి ఆసక్తి చూపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చిట్టిబాల ఆదినారాయణరెడ్డి, బీసీ సెల్ రాష్ట సంయుక్త కార్యదర్శి పొరకల రమణ, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌హెచ్ బాషా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బీఆర్ కేశప్ప, మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబుళపతి, మాజీ ఎంపీపీ జయరామిరెడ్డి, వైస్ ఎంపీపీ కె.సూర్యనారాయణ, సర్పంచ్‌లు ప్రమీలమ్మ, రజనీకాంత్‌రెడ్డి, ప్రసాద్, బొజ్జేనాయక్, ప్రమీలబాయి, మాసే రెడ్డెమ్మ, మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు జయమ్మ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రాజేంద్రనాయక్, చారుపల్లి పంచాయతీ పరిశీలకులు గోవిందరెడ్డి, మాజీ డీలర్లు మధుసూదన్‌రెడ్డి, యర్ర సూరి, నాయకులు కాళసముద్రం జయరామిరెడ్డి, పుల్లారెడ్డి, రామలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఎంసీ బయపరెడ్డి, రమణారెడ్డి, సీతారాం, వేళ్లమద్ది హరి, మంగేనాయక్, చంద్రశేఖర్, షరీఫ్, చిన్నా, సుధాకర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డి

ఉచిత వైద్యాన్ని దూరం చేసే కుట్ర