
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
తాడిమర్రి: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలతో పాటు వైద్యవిద్యను అభ్యసించాలనుకునే వారికి మేలు చేసేలా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గురువారం డీసీఎంఎస్ మాజీ అధ్యక్షుడు తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఆరోగ్యశ్రీ, 108, 104 వాహనాలు ప్రవేశపెట్టి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ప్రతి పంచాయతీలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కేవలం 12 మెడికల్ కళాశాలలు ఉండగా... వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. తన హయాంలోనే 5 కళాశాలను పూర్తి చేశారన్నారు. మిగిలిన 12 కళాశాలలు కూడా అందుబాటులోకి వస్తే వేలాది మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేవారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆయా మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుందన్నారు. దీనివల్ల భవిష్యత్ తరాలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని కేతిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మేధావులు, యువత ముందుకు వచ్చి ప్రభుత్వ తీరును ఖండించాలన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టిందని, కార్యక్రమం అనంతరం ఆ పత్రాలను గవర్నర్‌కు అందిస్తామని కేతిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షలు జొల్లిరెడ్డి అశ్వత్థ, బీసీ సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు కుంటాల పుల్లయ్య, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పొరాళ్ల విజయభాస్కర్‌రెడ్డి, అగిలే శంకర్‌రెడ్డి, మండల కన్వీనర్ ఆర్వేటి రామాంజనేయులు, యువజన విభాగం మండల అధ్యక్షుడు సిద్దే మోహన్‌రెడ్డి, సచివాలయాల కన్వీనర్లు మల్లప్పగారి మాధవరెడ్డి, అల్లే సాయినాథ్‌రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షలు కొండారుపల్లి విశ్వనాథ్, సల్లాపురం బాలరమణారెడ్డి, యలక శ్రీనివాసరెడ్డి, గుజ్జల హనుమంతు, పిట్టు పరమేశ్వర్‌రెడ్డి, పాటిల్ ప్రకాష్‌రెడ్డి, హనుమంతరెడ్డి, సన్నప్పయ్య, రాజేష్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఆత్మకూరు, నార్శింపల్లి సర్పంచులు కటనారాయణరెడ్డి, నారాయణస్వామి, కో ఆప్షన్ సభ్యులు బాబా ఫకృద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం