
కూటమి కుట్రలను తిప్పికొట్టండి
గాండ్లపెంట: రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రకు కూటమి సర్కార్ తెరలేపిందని కదిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ మండిపడ్డారు. ఈ కుట్రను కోటి సంతకాలతో తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గాండ్లపెంట మండలం కమతంపల్లి, కటారుపల్లి, తుమ్మలబైలు, తుమ్మలబైలు పెద్దతండా, గొడ్డువెలగల గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కొండవీటి నాగభూషణం, పార్టీ రాష్ట్ర ఎస్‌ఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మండల పార్టీ పరిశీలకులు లింగాల లోకేశ్వరరెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కళాశాలు పూర్తయితే పేదలుకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చేదన్నారు. అయితే ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం... వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం కావడం సిగ్గుచేటన్నారు. ప్రైవేటీకరణ పేరుతో తన అనుయాయులకు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందాలన్నా.. పేద విద్యార్థులు వైద్యను అభ్యసించాలన్నా కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోటి సంతకాలతో ఈ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కల్తీ మద్యంతో జనం జీవితాలతో చెలగాట మాడుతున్న కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలన్నారు. సమావేశం అనంతరం గ్రామ కమిటీలను నియమించి, సభ్యుల పేర్లను ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నాగభూషణంరెడ్డి, గంగోజమ్మ, అబ్బా ఆంజనేయులు, గొడ్డువెలగల ఆంజనేయులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఫయాజ్‌అలీ, మాజీ జెడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి, మండల పార్టీ ఇన్‌చార్జ్ శ్రీకాంత్‌రెడ్డి, కదిరి నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, మండల వైస్ కన్వీనర్ శంకర్‌నాయుడు, మాజీ కన్వీనర్ చంద్రశేఖరరెడ్డి, ఉప సర్పంచ్ ఫకృద్ధీన్, మండల యూత్ అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, ఎస్సీసెల్ నరసింహులు, మండల కోఆప్షన్ సభ్యుడు అమీర్‌ఖాన్, నాయకులు పామిడి ఇక్బాల్, వద్దిరెడ్డి కృష్ణారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, బయన్న, రామాంజులరెడ్డి, ఉత్తన్న, అజీం, దామోదర్, లీగల్ సెల్ అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డి, స్ధానిక నాయకులు హరిప్రసాదరెడ్డి, సుబ్బారెడ్డి, రామకృష్ణ, మైనుద్ధీన్, శేఖర్, రాజన్న, నవీన్, గోవర్ధన్‌నాయక్, అజయ్‌నాయక్, గోవిందరెడ్డి, గిరిబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
పేద విద్యార్థులకు వైద్య విద్యను
దూరం చేస్తున్న ప్రభుత్వం
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మక్బూల్

కూటమి కుట్రలను తిప్పికొట్టండి