
ఇలా ఉంటే రోగాలు రావా?
ధర్మవరం రూరల్: వీధుల్లో మురుగుపారుతూ అపరిశుభ్రంగా ఉంటే రోగాలు రావా? అని జిల్లా పరిషత్ సీఈఓ శివశంకర్ అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లపైనే మురుగునీరు, దిబ్బలు ఉండటం చూసి పంచాయతీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ఎవరికి వారు తమ పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్లల్లోని మురుగు నీటిని రోడ్లపైకి వదలకూడదన్నారు. అనంతరం ఐవీఆర్‌ఎస్ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన వెంట ఎంపీడీఓ సాయిమనోహర్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
అపరిశుభ్రతపై జెడ్పీ సీఈఓ అసహనం