
ఆదాయం ఎర.. దోపిడీ పరంపర
చిలమత్తూరు: ముచ్చటైన ఆఫర్లు.. కళ్లెదుటే లాభాలు.. చుట్టపక్కల వాళ్లను జత చేస్తే బోనస్‌లు.. బ్యాంక్ ఖాతాలోకి తెరతెరలుగా వచ్చి పడుతున్న డబ్బును చూసి అందరికీ ఆశ కలిగింది. ఒకరిని చూసి మరొకరుగా చేరుతుండడంతో కంపెనీకి విస్తృత ప్రచారం లభించింది. కొత్త ఖాతాలు పెరగడంతో పాటు వ్యాపారమూ ఊపందుకుంది. అంతా సజావుగా సాగిపోతోందనుకుంటుండగానే రాత్రికి రాత్రి మాయమైంది. ఇది జిల్లాలో సరికొత్తగా వెలుగు చూసిన ఆన్‌లైన్ మోసం. ఈ చైన్ లింక్ వ్యవహారాన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వారు రూ.లక్షల్లో నగదు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు.
ఆదాయాన్ని ఎరగా చూపి దోపిడీ చేసే యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన యాప్‌ల ఉచ్చులో మహిళలే ఎక్కువగా చిక్కుకుంటున్నారు. తొలుత డబ్బు తమ ఖాతాలకు జమ అవుతుంటే సంతోషపడిన మనసులు, ఆఖరుకు మోసపోయామని తెలుసుకుని లబోదిబో మంటున్నాయి. తెలివైన వాళ్లు ఆదిలోనే ఆదాయం రాగానే ఆపేస్తుండగా, తాజాగా జిల్లాలో చాలా మంది ఈజీ మనీ కదా అని ఎల్‌జీ డిజిటల్ మీడియా యాప్ ఉచ్చులో చిక్కుకుని రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారు. రూ. వందల్లో పెట్టుబడి పెట్టి ప్రచార వీడియోలు చూస్తే రూ.వేలల్లో బ్యాంక్ ఖాతాలకు నగదు జమ అవుతుందని వాట్సాప్ నంబర్‌కు విదేశీ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌ను చూసి చాలా మంది బోల్తాపడ్డారు. ముందుగా వారు చెప్పినట్లుగానే వెబ్‌సైట్ నుంచి యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కొంత మొత్తాన్ని తొలుత పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత కొంత మొత్తం వాలెట్‌లో కనిపించింది. ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కూడా ఉండడంతో చాలా మంది ఎంతో బాగుందని అనుకున్నారు. ఇదే విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పి వారిని కూడా ఉచ్చులోకి లాగేశారు. చైన్‌లింక్‌లో సభ్యులను చేర్పిస్తే బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు అంటూ ఊరించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా చేరుతూ వచ్చారు. ఎందుకు నగదు జమచేస్తున్నామో తెలియకుండానే పెట్టుబడి పెడుతూ వెళ్లారు. చివరకు సైట్ మూసేయడంతో తాము మోసపోయినట్లుగా తెలుసుకుని ప్రస్తుతం లబోదిబో మంటున్నారు.
ముదురుతున్న చైన్‌లింక్ వ్యవహారం
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న
ఫేక్ కంపెనీలు
రూ.లక్షలు పోగొట్టుకుంటున్న ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
ఫేక్ కంపెనీలు ఇచ్చే ప్రకటనలను చూసి విద్యావంతులు సైతం మోసపోతున్నారు. ఇది దురదృష్టకరమన్నారు. పనికి తగ్గ వేతనం ఉంటుంది. అయితే పనీపాట లేకుండా ప్రకటన వీడియోలు చూస్తూ డబ్బు సంపాదించాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోతున్నట్లుగా తెలుసుకుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. – జనార్దన్, సీఐ,
హిందూపురం రూరల్ సర్కిల్
ఈజీ మనీ కదా అనుకుంటే..
ప్రస్తుతం ఎటు చూసినా ఆన్‌లైన్ మోసాలు,
సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సామాన్యులే కాకుండా ఉన్నత
విద్యావంతులు సైతం
ఈ మోసాల బారిన
పడి రూ.లక్షల్లో
పోగొట్టుకుంటున్నారు.

ఆదాయం ఎర.. దోపిడీ పరంపర

ఆదాయం ఎర.. దోపిడీ పరంపర