గాయని బాల స‌ర‌స్వ‌తీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం | YSRCP Chief YS Jagan Condoles Death Of Film Playback Singer Raavu Balasaraswathi Devi, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

గాయని బాల స‌ర‌స్వ‌తీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

Oct 15 2025 4:19 PM | Updated on Oct 15 2025 6:45 PM

YS Jagan Condoles Death Of Film Playback Singer Balasaraswathi Devi

సాక్షి, తాడేపల్లి: సినీ నేపథ్య గాయని బాల స‌ర‌స్వ‌తీ దేవి మృతిపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సంగీత ప్ర‌పంచంలో బాల సరస్వతీ దేవి త‌న అద్భుత గాత్రంతో ప్ర‌త్యేక ముద్ర వేశారు. తొలి సినీ నేప‌థ్య గాయ‌ని రావు బాల స‌ర‌స్వ‌తీ దేవిగారి మృతి ప‌ట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా.. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్ర‌గాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

తెలుగులో తొలి మహిళా సింగర్‌ రావు బాలసరస్వతి దేవి (97) ఇవాళ ఉదయం (అక్టోబర్‌ 15) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్‌ పాడారు.

గాయని బాల స‌ర‌స్వ‌తీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement