ఆటో డ్రైవర్ల అగచాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ల అగచాట్లు

Aug 23 2025 6:41 AM | Updated on Aug 23 2025 6:41 AM

ఆటో డ

ఆటో డ్రైవర్ల అగచాట్లు

పుట్టపర్తి అర్బన్‌: సీ్త్ర శక్తి పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆర్బాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. వేలాది మంది ఆటో కార్మికులను బజారున పడేసింది. ఇంత కాలం స్టేజ్‌ టు స్టేజి వెళ్లడానికి ఆటోలపై రోజూ వేలాది మంది ప్రయాణించేవారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు, ఉద్యోగినులు, విద్యార్థినులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుండడంతో ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల జీవనం దుర్భరంగా మారింది. రోజంతా వేచి చూసిన రూ.100 కూడా ఆదాయం లేకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.

వాహన మిత్రతో ఆదుకున్న వైఎస్‌ జగన్‌..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర పథకంతో ఆటో డ్రైవర్లను అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకున్నారు. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికీ రూ.10 వేలు చొప్పున ఏటా ఆర్థిక సాయాన్ని అందజేస్తూ వచ్చారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఆటో కార్మికుడికి రూ.15వేలు అందజేస్తామని కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఆటో డ్రైవర్లను దగా చేశారు. రెండో ఏడాదిలో ఇప్పటికే సగం గడిచిపోయింది. అయినా రూ.15 వేల ఆర్థిక సాయంపై ఎలాంటి ఊసు లేదు. దీనికి తోడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ప్రస్తుతం ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది.

రుణం కంతు చెల్లించడమూ భారమే..

జిల్లా వ్యాప్తంగా ఆటోలు, జీపులపై ఆధారపడి దాదాపు 42 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో రుణాలు తీసుకుని వాహనాలు సమకూర్చుకున్నారు. కనీసం రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ఆదాయం ఉండేది. ఈ సంపాదనతోనే క్రమం తప్పకుండా నెలకు రూ.5 వేలకు పైగా రుణం కంతులు చెల్లిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోలకు అద్దెలు దొరక్క ఎక్కడికక్కడ స్టాండ్లలో నిలిచిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేచి ఉన్నా.. రూ. 100 కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి వచ్చిన వారం రోజుల్లోనే కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. వచ్చే 1వ తేదీన రుణాల కంతులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులు లేక ప్రశాంతి గ్రామం

వద్ద చెట్ల కింద నిలిపిన ఆటోలు

సీ్త్ర శక్తి పథకంతో

రోడ్డున పడిన ఆటో కార్మికులు

జిల్లాలో 42 వేల మందిపై ప్రభావం

రుణాల కంతులు చెల్లించలేక

ఇబ్బందులు

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు

జీవనోపాధి కల్పించండి

పుట్టపర్తి టౌన్‌: సీ్త్ర శక్తి పథకం అమలు ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోల్పోయామని మాకు జీవనోపాధి కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని అటోడ్రైవర్లు కోరారు. ఈ మేరకు వారి బాధలు, జీవనోపాధిని వివరిస్తూ తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. పుట్టపర్తి పట్టణంలోనే దాదాపు 500 మంది ఆటోలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఆటోల్లో మహిళలు ప్రయాణించక పోవడంతో రోజుకు రూ.150 సంపాదన కూడా లేదన్నారు. 8 శాతం వడ్డీతో ఫైనాన్స్‌ కంపెనీల్లో రుణం తీసుకుని ఆటోలు కొనుగోలు చేశామని, ఇప్పటికే కంతులు చెల్లించలేని 150 ఆటోలను ఫైనాన్స్‌ కంపెనీలు స్వాధీనం చేసుకున్నారని వాపోయారు. సీ్త్ర పథకం పుణ్యమా అని మిగిలిన ఆటోలను కూడా త్వరలో ఫైనాన్స్‌ కంపెనీ వారు జప్తు చేస్తే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు.

రూ.25 వేలు ఇవ్వాలి

ఆటోలు, జీపులు, ఇతర వాహనాల ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.25 వేలు అందజేయాలి. ఎన్నికల హామీని అమలు చేయకుండా ఇప్పటికే ఏడాదిన్నర గడిపేశారు. డిమాండ్‌ సాధనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నాం.

– బాబావలి, ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి

ప్రత్యామ్నాయం చూపాలి

ఫ్రీ బస్సు పథకానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఆటోలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మాకు ప్రత్యమ్నాయం చూపాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వంపై ఉంది. రోజూ ఆటోలు ఎక్కువగా ఎక్కేది మహిళలే. ఇప్పుడు వారంతా బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. రోజంతా ఆటో నడిపినా రూ.200 కూడా రావడం లేదు. ఆటోకు డీజిల్‌, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఆటో మరమ్మతులు, రుణం కంతులు, ఎఫ్‌సీలు ఎలా చేయించుకోవాలో అర్థం కావడం లేదు. – నబీరసూల్‌, లోచర్ల, కొత్తచెరువు మండలం

ఆటో డ్రైవర్ల అగచాట్లు1
1/2

ఆటో డ్రైవర్ల అగచాట్లు

ఆటో డ్రైవర్ల అగచాట్లు2
2/2

ఆటో డ్రైవర్ల అగచాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement