
ప్రమాదంలో వ్యక్తి మృతి
అమరాపురం: మండలంలోని ఉదుగూరు – కాచికుంట గ్రామాల మధ్య చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిబండ మండలం గుడ్డదహళ్లి గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ (43) అమరాపురం మండలం కెంకెర గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. గురువారం వ్యక్తిగత పనిపై అమరాపురం గ్రామానికి వెళ్లిన ఆయన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై కెంకర గ్రామానికి బయలుదేరాడు. ఉదుగూరు – కాచికుంట గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా.. ద్విచక్ర వాహనం అదుపు తప్పి మోరీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యాదవ విద్యార్థులకు
ప్రతిభా పురస్కారాలు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు నక్కారామారావు ఎడ్యుకేషనల్, కల్చరల్ ట్రస్ట్ బోర్డు, యాదవ సంఘం, యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు జి.నాగభూషణం, జి.శ్రీనివాసులు, బి.రామకృష్ణ, ఎం.శ్రీరాములు, ఉమాశంకర్, హేమంత్, లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతిలో 400పైబడి మార్కులు, ఇంటర్‌లో 700పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. జూన్ 1న పురస్కారాలు అందజేయనున్నారు. మరింత సమాచారానికి 83094 75846, 94922 87710లో సంప్రదించవచ్చు.
వీరజవాన్ కుటుంబ సభ్యులకు పరామర్శ
గోరంట్ల: వీరజవాన్ మురళీనాయక్ కుటుంబసభ్యులను ప్రముఖ నటుడు శివారెడ్డి పరామర్శించారు. గురువారం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మురళీనాయక్ తల్లి జ్యోతిబాయిని పరామర్శించారు. మురళీనాయక్ త్యాగం మరువలేనిదని కొనియాడారు. అనంతరం ప్రముఖ ఆర్టిస్ట్ వాసు గీచిన మురళీనాయక్ చిత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట స్థానిక సర్పంచ్ వాసునాయక్ ఉన్నారు.
కారు దగ్ధం
ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వెనిల్ అనే వ్యక్తితో కలసి మరో వ్యక్తి అనంతపురం నుంచి కారులో ధర్మవరానికి బయలుదేరాడు. చిగిచెర్ల సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి పొగలు రాసాగాయి. గమనించిన వారు కారు ఆపి కిందకు దిగారు. అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
‘కియా’కు సమ్మె నోటీసు
పెనుకొండ రూరల్: దేశ వ్యాప్తంగా ఈ నెల 20 తేదీన చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. కియా కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనేలా కియా పరిశ్రమకు నోటీసులు అతికించారు. నాయకులు మాట్లాడుతు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్‌లుగా బిల్లు తీసుకొచ్చిందన్నారు. కార్మికుల కష్టాన్ని పెట్టుబడి దారులకు దోచిపెట్టేందుకే లేబర్ కోడ్లును తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయి కొనుగోలు శక్తి తగ్గిందన్నారు. సమ్మె విజయవంతానికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హరి, బాబావలి, సాంబ శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రమాదంలో వ్యక్తి మృతి