‘హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్‌ పనులు చేపట్టొద్దు’ అని యావత్తు ఉమ్మడి జిల్లా రైతాంగం ముక్త కంఠంతో నినదిస్తున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలు, వివిధ పార్టీల నాయకులు రోడ్లెక్కి ఆందోళనలు చ | - | Sakshi
Sakshi News home page

‘హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్‌ పనులు చేపట్టొద్దు’ అని యావత్తు ఉమ్మడి జిల్లా రైతాంగం ముక్త కంఠంతో నినదిస్తున్నా చంద్రబాబు సర్కారు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సంఘాలు, వివిధ పార్టీల నాయకులు రోడ్లెక్కి ఆందోళనలు చ

May 9 2025 1:42 AM | Updated on May 9 2025 1:42 AM

‘హంద్

‘హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్‌ పనులు చే

ఆత్మకూరు సమీపంలో జరుగుతున్న హంద్రీ–నీవా లైనింగ్‌ పనులు

అనంతపురం సెంట్రల్‌: ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో నీటి అవసరాలు బాగా పెరిగాయి. 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు. భవిష్యత్‌లో పారిశ్రామికంగా కూడా మరింతగా ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందే అవకాశముంది. ఈ సమయంలో ఏ ప్రభుత్వమైనా తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తీసుకొచ్చే పనులకు శ్రీకారం చుడుతుంది. కానీ చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా హంద్రీ–నీవా కాలువకు సిమెంట్‌ పూతలు పూసే పనులకు తెరలేపింది.

స్వలాభం కోసమే..

హంద్రీనీవా ఫేజ్‌–2 కింద 7 ప్యాకేజీల్లో లైనింగ్‌ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం రూ. 936 కోట్లు వెచ్చిస్తున్నారు. లైనింగ్‌ పనులకు టెండర్లు ఈ ఏడాది మార్చిలో ఖరారయ్యాయి. ఏప్రిల్‌ నుంచి పనులు చేపడుతున్నారు. జూన్‌ 10 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో వేగంగా పూర్తి చేయాలనే నెపంతో కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పనుల నాణ్యతను ఇంజినీర్లు ఎవరూ పరిశీలించే సాహసం చేయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వలాభం కోసమే హంద్రీ–నీవా లైనింగ్‌ పనులకు తెర తీశారని, టీడీపీ ముఖ్య నేతలకు భారీగా ముడుపులు అందాయని, దీంతోనే ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందుకే... ‘లైనింగ్‌ పనులు వద్దు మొర్రో’ అని రైతులు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. కేవలం నీటిని తన సొంత నియోజకవర్గం కుప్పానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో లైనింగ్‌ పనులు చేపడుతూ, తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఉమ్మడి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్‌ కుటుంబంతోనే హంద్రీనీవాకు జీవం..

2004కు ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను చూసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంత పరిస్థితులను చూసి చలించిపోయారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయాలని తలచి.. అప్పటివరకూ తాగునీటి పథకంగా శిలాఫలకానికే పరిమితమైన ‘హంద్రీ–నీవా’ను తాగు,సాగునీటి ప్రాజెక్టుగా మార్చి 2009 నాటికే మొదటి దశ పనులను పూర్తి చేశారు. రెండో దశ పనులు కూడా 60 శాతం పూర్తయ్యాయి. ఆయన చలువతో 2012 నుంచి హంద్రీ–నీవా ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతున్నాయి. ఇక.. వైఎస్సార్‌ బాటలోనే ఆయన తనయుడు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీ–నీవాను మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే తీసుకోగలుతున్నామని, దీన్ని 6,300 క్యూసెక్కులకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాకుండా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రూ. 6,182 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చి టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే, ఆ క్రమంలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైపోయింది.

జగన్‌ హయాంలో నిర్ణయం మేరకు

పెరగాల్సిన సామర్థ్యం

6,300

క్యూసెక్కులు

చంద్రబాబు ప్రభుత్వం పరిమితం చేసింది

3,850

క్యూసెక్కులు

లైనింగ్‌.. దోపిడీకి టెండరింగ్‌

హంద్రీ–నీవా లైనింగ్‌ పనుల్లో కాంట్రాక్టర్లకు డబ్బే డబ్బు

కాంట్రాక్టు సంస్థల నుంచి

నేతలకు భారీగా ముడుపులు!

నాసిరకంగా పనులు జరుగుతున్నా కన్నెత్తి చూడని అధికారులు

జూన్‌ 10 నాటికి పనులు పూర్తి

హంద్రీ–నీవా లైనింగ్‌ పనులు జూన్‌ 10 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పనులు పరిశీలించేందుకు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురానికి నేడు సీఎం వస్తున్నారు. అక్కడ గ్రామ సభ నిర్వహిస్తారు. అనంతరం లైనింగ్‌ పనులపై హంద్రీ–నీవా అధికారులతో సమీక్షిస్తారు. జిల్లాలో పనులు అన్నిచోట్లా ప్రారంభమయ్యాయి.

– నాగరాజ, సీఈ, జలవనరులశాఖ

‘హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్‌ పనులు చే1
1/1

‘హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్‌ పనులు చే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement