జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
కదిరి అర్బన్: త్వరలో జరిగే జాతీయ స్థాయి మహిళల హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లాకు చెందిన నక్షత్ర, సభాఖానం, షబ్రీన్, సరిత, ఝాన్సీరాణి ఎంపికయ్యారు. ఈ నెల 3, 4వ తేదీల్లో ఒంగోలు జిల్లా మార్కాపురంలో జరిగిన 54వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. జట్టులో ప్రతిభ చూపిన నక్షత్ర, సభాఖానం, షబ్రీన్, సరిత, ఝాన్సీరాణిని జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు ఎంపిక చేసినట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ తెలిపారు.
‘పోలీసు గ్రీవెన్స్’కు 70 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, ఆదినారాయణ, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● ఇద్దరికి తీవ్ర గాయాలు
బత్తలపల్లి: మండలంలోని యర్రాయపల్లి బస్సు స్టేజ్ వద్ద సోమవారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం పూలకుంట, చియ్యేడు గ్రామాలకు చెందిన కృష్ణారెడ్డి, రవీంద్రారెడ్డి ద్విచక్ర వాహనంపై బత్తలపల్లి వైపు నుంచి స్వగ్రామాలకు వెళుతుండగా యర్రాయపల్లి మలుపు వద్ద అనంతపురం వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన చిన్నారి దింపానకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోక్సో కేసు నమోదు
ధర్మవరం రూరల్: మండలంలోని గుట్టకిందపల్లికి చెందిన నరసింహులుపై పోక్సో యాక్ట్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల వయసున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫొటోలు తీశాడంటూ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సోమవారం తెలిపారు.
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక


