ధర్మవరం అర్బన్: పట్టణంలోని బ్రాహ్మణవీధిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు పట్టణంలోని శమీనారాయణస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా గరుడ చిత్రపటానికి పూజలు నిర్వహించి మేళతాళాలతో ఊరేగింపుగా లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ధ్వజారోహణను అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్, చక్రధర్‌లు వేదమంత్రాల నడుమ నిర్వహించారు. ఉభయ దాతలుగా గజనాణ్యం పట్టుసాలే సంఘం ప్రతినిధులు వ్యవహరించారు. అనంతరం లక్ష్మీచెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను పూల పల్లకీపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశులు, అడహక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వరప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నేడు సూర్య, చంద్రప్రభ వాహన సేవ
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం సూర్యప్రభ, సాయంత్రం చంద్రప్రభ వాహనాల్లో స్వామి వారిని ఊరేగించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు