బాలల సంరక్షణ సదనాల సిఫార్సుల కమిటీ ఏర్పాటు
ప్రశాంతి నిలయం: జిల్లాలో బాలల సంరక్షణ సదనాల నిర్వహణకు జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీని ఏర్పాటు చేశారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు సభ్యులను ఎంపిక చేశారు. కమిటీలో ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీపీఓ ఖలీల్‌బాషా, డీసీపీఓ మహేష్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, సీడబ్లూసీ సభ్యులు ఓబులపతి, ఆదినారాయణమ్మ సభ్యులుగా ఉన్నారు. నూతన కమిటీ సభ్యులు రిజిస్ట్రేషన్ చేసుకున్న సదనాల వివరాలు, వారి అర్హతలు పరిశీలించారు. జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది బాలల సంరక్షణ సదనాలు ఉన్నాయి.


