ప్రపంచానికే న్యాయాన్ని పంచిన అంబేడ్కర్
పెనుకొండ రూరల్: పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ అన్నారు. అంబేడ్కర్ జయంతి ముగింపు వేడుకలను పెనుకొండలోని మార్కెట్ యార్డ్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం మాధవ మాట్లాడారు. న్యాయ శాఖ కోవిదుడుగా ప్రపంచానికే న్యాయాన్ని పంచిన మహనీయుడిగా అంబేడ్కర్ ఖ్యాతిగాంచారన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, జోనల్ ఇన్‌చార్జ్ సందిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా కో కన్వీనర్ గోపీనాథ్, రమేష్‌రెడ్డి, తలుపుల గంగాధర్, భాస్కర్ నాయక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ


