● చంద్రప్రభపై చౌడేశ్వరీదేవి
అమడగూరు: చౌడేశ్వరీ దేవి వార్షిక ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు మంగళవారం అమ్మవారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అమడగూరుకు చెందిన బ్రాహ్మణ, శెట్టి బలిజ సంఘం సభ్యులు చంద్రప్రభ ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విశేష అలంకరణలో చంద్రప్రభపై కొలువుదీరిన అమ్మవారిని గ్రామమంతా ఊరేగించి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి ఎదుట కొలువుదీర్చారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించి భజన చేశారు. కాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి బోనాలు..
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో అమ్మవారికి బోనాలు సమర్పించారు. చీకిరేవులపల్లి, గంగిరెడ్డిపల్లి, రెడ్డివారిపల్లి, బలకవారిపల్లి, అమడగూరు గ్రామాల్లో మహిళలు బోనాలు తీసుకువెళ్లి చౌడేశ్వరీ అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో పెద్దత్తున జంతుబలులను అర్పించారు. బంధుమిత్రులతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకుంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీజ్యోతి ఉత్సవం నిర్వహించనున్నారు.
● చంద్రప్రభపై చౌడేశ్వరీదేవి


