
ఎస్‌ఐ సుధాకర్‌పై చర్యలు తీసుకోండి
మడకశిర: పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఏజెంట్‌లా మారిన రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. లేకపోతే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా మాజీ సీఎంను ఏకవచనంతో సంబోధించడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఓ రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్‌కు తగదన్నారు. గతంలో చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు పోలీసులను ఏకవచనంతో దూషించిన రోజు ఎందుకు వారిని విమర్శించలేదని ప్రశ్నించారు. పరిటాల రవి కుటుంబీకులు చెప్పిన విధంగానే తాను పనిచేస్తానంటూ వృత్తి ధర్మాన్ని విస్మరించిన సుధాకర్ యాదవ్.. పోలీస్ ఉద్యోగానికి అనర్హుడని, తక్షణమే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని శాఖ ప్రతిష్టను కాపాడాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి