కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అలుకోత్సవం నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి విశేషాలంకరణ చేసి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవం ఉభయదారులుగా వ్యవహరించిన ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
నేడు తీర్థవాది ఉత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం భృగుతీర్థం(కోనేరు)లో తీర్థవాది ఉత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం(రేపు) నిర్వహించనున్న పుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం
నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం


