ప్రశాంతి నిలయం: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలను కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జేసీ తొలుత పొట్టిశ్రీరాములు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు నేటి యువతకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఏఓ వెంకటనారాయణ, పర్యాటక శాఖ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.
పొట్టిశ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం
పుట్టపర్తి టౌన్: త్యాగమూర్తి, నిరాడంబరుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ మహేష్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అమరజీవి సేవలు చిరస్మరణీయం


