
చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్
● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
బత్తలపల్లి: ‘‘నేనూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నా. చదువుకుంటేనే పది మంది మనల్ని గౌరవిస్తారు. మంచి భవిష్యత్ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం వీడకండి. ఏదైనా కష్టం వస్తే తెలపండి. పరిష్కారానికి చర్యలు తీసుకుంటా’’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విద్యార్థులకు సూచించారు. అహర్నిశలు శ్రమిస్తూ లక్ష్యం దిశగా అడుగులేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థినుల సౌకర్యార్థం రూ.2 కోట్లతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ బాలికల వసతి గృహాన్ని నిర్మించారు. శనివారం మంత్రి సత్యకుమార్ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వసతి గృహంలోని గదులు, సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థినుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ నరసింహనాయుడు, జెడ్పీటీసీ సుధ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి, పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ప్రారంభం
ముదిగుబ్బ: మండల పరిధిలోని మలకవేమల క్రాస్ యనుములవారిపల్లి దగ్గర శనివారం హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివివధ సమస్యలపై ప్రజల మంత్రికి అర్జీల సమర్పించారు. వాటిని స్వీకరించిన మంత్రి... వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరావు, ఎంపీపీ ఆదినారాయణ, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. భక్తుల గోవింద నామస్మరణతో ఖాద్రీ క్షేత్రం మార్మోగిపోతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా శేష వాహనంపై తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. వైకుంఠంలో స్వామి నిత్యం పవళించి ఉండే శేషతల్పం ఆ స్వామితో పాటే భువికి దిగి వచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవాల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిస్తున్నారని వారి నమ్మకం. ‘శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి’ అని అర్చక పండితులు పేర్కొన్నారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే సర్పదోషం పోతుందని భక్తుల నమ్మకం. ఉత్సవ ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే భక్తుల కోసం ఆలయంలో ఉదయం నుంచి రాత్రి 11 వరకూ నిత్యన్నదానం కొనసాగుతోంది.
నేడు సూర్య, చంద్రప్రభ వాహనాల్లో విహారం
పుట్టడం, జీవించడం, మరణించడం అనే మూడు ప్రక్రియలు కాలాఽధీనాలు. కాల స్వరూపుడిని తానేనంటూ భక్తులకు చాటి చెప్పేందుకు శ్రీవారు ఆదివారం పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు.
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
గోవింద నామస్మరణతో మార్మోగుతున్న కదిరి

చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్

చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్

చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్