భూసేకరణ పనులన్నీ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ పనులన్నీ పూర్తి చేయాలి

Mar 12 2025 7:26 AM | Updated on Mar 12 2025 7:23 AM

ప్రశాంతి నిలయం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణ పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాలులో ఎన్‌హెచ్‌ 342, ఎన్‌హెచ్‌–716జీ, జాతీయ రహదారులు, వివిధ ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారుల కోసం సేకరించిన భూముల రైతులకు ఇచ్చిన పరిహారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే భూసేకరణ పెండింగ్‌ పనులపై ఆరా తీశారు. ప్రమాదాలు జరిగేందుకు అస్కారం ఉన్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ లైన్లు మార్పు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బుక్కపట్నం మండలం సిద్దరాంపురం పంచాయతీ భవనం, చిన్నరాయునిపల్లి ప్రాథమిక పాఠశాల కాంపౌండ్‌ వాల్‌ సమస్య, బుక్కపట్నం గ్రామ గోశాల సమస్య, పుట్టపర్తి, పెడబల్లి, బూదిలి భూసేకరణకు సంబంధిత అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, ఎన్‌హెచ్‌ ఏఐ పీడీ బి.అశోక్‌ కుమార్‌, ముత్యాలరావు, నాగరాజు, ఎల్‌. సుజాత, తహసీల్దార్లు కళ్యాణ్‌ చక్రవర్తి, మారుతి, సురేష్‌ బాబు పాల్గొన్నారు.

‘పురం’ మున్సిపల్‌ కమిషనర్‌

నియామకంపై రిట్‌

చిలమత్తూరు: హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌ సంగం శ్రీనివాసులు నియామకంపై హైకోర్టులో ఎస్‌.శ్రీధర్‌ అనే వ్యక్తి మంగళవారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషనర్‌ అయ్యేందుకు సంగం శ్రీనివాసులును కనీస విద్యార్హత లేదన్నారు. కానీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో హిందూపురం కమిషనర్‌గా నియమిస్తూ జీఓ ఇచ్చిందన్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. వెంటనే ఆ నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌, ‘పురం’మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఇష్టారాజ్యంగా బిల్లులు మంజూరు చేయించుకునేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు సంగం శ్రీనివాసులును పురం మున్సిపల్‌ కమిషనర్‌గా నియమించాలని సిఫారసు చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆయన నియామకాన్నే సవాల్‌ చేస్తూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం సంచలనంగా మారింది.

మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా పని చేయాలి

సిబ్బందికి డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం పిలుపు

పుట్టపర్తి అర్బన్‌: మాతాశిశు సంరక్షణే ధ్యేయంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది పని చేయాలని డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగం పిలుపునిచ్చారు. మంగళవారం డీఎంహెచ్‌ఓ తన కార్యాలయంలో మాతాశిశు మరణాలకు సంబంధించి జిల్లా స్థాయి సబ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో రెడ్డిపల్లి, సోమందేపల్లి, శివనగర్‌, చిలమత్తూరు, కొక్కంటి, దర్శినమల, పెద్ద మంతూరు పీహెచ్‌సీల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 7 శిశు మరణాలు సంభవించాయన్నారు. తల్లీబిడ్డలను సంరక్షించుకునేందుకు వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. బాలింతలు, గర్భిణులకు అవగాహన కల్పించడం ద్వారా మాతాశిశు మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్రతి నెలా 9వ తేదీన జరిగే శిక్షణలో గర్భిణులకు అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ తిప్పేంద్రనాయక్‌, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్‌ మంజువాణి, డాక్టర్‌ సెల్వియా సాల్మన్‌, డాక్టర్‌ నాగేంద్రనాయక్‌, డాక్టర్‌ సునీల్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీలత, పీడీయాట్రీషియన్‌ డాక్టర్‌ జోయెల్‌ వెస్లీ, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, 108 ఈఓ అబ్దుల్‌ హుస్సేన్‌, పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భూసేకరణ పనులన్నీ    పూర్తి చేయాలి 1
1/1

భూసేకరణ పనులన్నీ పూర్తి చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement