కళ్యాణదుర్గం: కాలినడకన వెళుతున్న ఓ వివాహిత మెడలోని బంగారు మాంగ్యలంచైన్‌ను దుండగుడు లాక్కెళ్లాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గంలోని ఆర్టీసీ బస్టాండ్ కాలనీలో నివాసముంటున్న ఉష.. ఆదివారం ఉదయం తన స్నేహితురాలితో కలసి పంపనూరు క్షేత్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వేకువజామునే ఇంటి వద్ద నుంచి బస్టాండ్‌కు బయలుదేరిన వారిని వెంబడిస్తూ వచ్చిన దుండగుడు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే వెనుక నుంచి ఉష మెడలోని మూడు తులాల బరువైన బంగారు మాంగల్యం చైన్‌ను లాక్కొని వడ్డే కాలనీ వైపు పరుగు తీశాడు. బాధితురాలు వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంతో కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆచూకీ లక్ష్యం కాకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


