అల్లూరు అభివృద్ధే అజెండా | - | Sakshi
Sakshi News home page

అల్లూరు అభివృద్ధే అజెండా

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

● వైఎస్సార్సీపీ చైర్మన్‌ అభ్యర్థి లక్ష్మయ్య

అల్లూరు: నూతనంగా ఏర్పడిన అల్లూరు నగర పంచాయతీకి చైర్మన్‌గా తనకు అవకాశమిస్తే, అభివృద్ధే అజెండాగా పనిచేస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరుగుంట లక్ష్మయ్య పేర్కొన్నారు. ఈ మేరకు సాక్షి నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రాధాన్య క్రమంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని వెల్లడించారు.

ప్రశ్న: మీ లక్ష్యమేమిటి..?

సమాధానం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డితో చాలా కాలంగా పయనిస్తున్నా. అల్లూరులో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తా. ఒక్క అవకాశమిస్తే, డెవలప్‌మెంట్‌కు అంకితభావంతో పనిచేస్తా.

ప్రశ్న: విజయావకాశాలపై మీ స్పందన..?

సమాధానం: అల్లూరు నగర పంచాయతీలో 23 వార్డులకు గానూ 18 చోట్లే ఎన్నికలు జరగనున్నాయి. మెజార్టీ వార్డుల్లో మా పార్టీకి స్పష్టమైన ఆధిక్యముంది. మా పార్టీకి ప్రజలు పట్టం కడతారనే నమ్మకముంది.

ప్రశ్న: సమస్యలపై ఎలా వ్యవహరిస్తారు..?

సమాధానం: అల్లూరు నగర పంచాయతీలో చాలా సమస్యలున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఏ అంశంపైనా చిత్తశుద్ధితో పనిచేయలేదు. ప్రధానంగా తాగునీరు, పారిశుధ్య సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ఎస్టీ కాలనీలో సిమెంట్‌ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు చొరవ చూపుతా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement