పొదలకూరు: పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మొగళ్లూరు గ్రామానికి చెందిన ఎండేపల్లి రోశయ్య (65) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. రోశయ్య కుమారుడు అయ్యప్ప మాల ధరించాడు. అతడిని శబరిమల యాత్రకు పంపేందుకు బస్సు ఎక్కించి తిరిగి కాలినడకన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని కేఆర్‌ఆర్ నగర్ వద్ద ఓ యువకుడు బైక్‌పై వచ్చి వేగంగా రోశయ్యను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు, తలకు గాయాలయ్యాయి. స్థానికులు, బంధువులు వెంటనే పొదలకూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు.


