గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్‌

Nov 24 2026 12:12 AM | Updated on Nov 24 2026 12:12 AM

నెల్లూరు(క్రైమ్‌): తాళం వేసిన ఇంట్లో నగదు, బంగారు ఆభరణం చోరీ చేసిన కేసును నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రూ.9.63 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నగర ఏఎస్పీ దీక్ష, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావుతో కలిసి తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. ఎన్జీఓ కాలనీలో ఖాదర్‌బాషా, మున్వర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. ఖాదర్‌బాషా పనినిమిత్తం ఢిల్లీ వెళ్లగా, ఈనెల 21వ తేదీన మున్వర్‌ ఇంటికి సమీపంలో ఇస్తిమాకు వెళ్లారు. తిరిగొచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలోని రూ.6.43 లక్షల నగదు, 32 గ్రాముల బంగారు లాంగ్‌హారం కనిపించలేదు. ఈ ఘటనపై ఆమె ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు బీవీ నగర్‌కు చెందిన లాల్‌ రబియా, చంద్రబాబు నగర్‌కు చెందిన చంద్రకాంత్‌గా గుర్తించి సోమవారం అరెస్ట్‌ చేశారు. నిందితురాలు లాల్‌ రబియా తరచూ బాధితురాలి ఇంటికి వెళ్లివస్తూ నగదు ఉన్న విషయం తెలుసుకుని తనకు తెలిసిన చందక్రాంత్‌తో కలిిసి చోరీకి పాల్పడినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిందితులను అరెస్ట్‌ చేసి చోరీ సొత్తు రికవరీ చేసిన ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై ప్రసాద్‌రెడ్డి, సిబ్బందిని ఏఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement